క్యాబ్ డ్రైవర్‌పై కాట్రాజు వీరంగం.. సుప్రీత్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు
టాలీవుడ్ నటుడు సుప్రీత్ రెడ్డి తాజాగా ఓ వివాదాస్పద ఘటనతో వార్తల్లో నిలిచారు. పలు చిత్రాల్లో విలన్, సహాయ పాత్రల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆయనపై ఓ క్యాబ్ డ్రైవర్‌పై దాడి చేశారనే ఆరోపణలు రావడంతో ఈ విషయం సినీ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. బాధితుడు శ్రీహరి అనే వ్యక్తి ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఓ ట్రిప్ పూర్తి చేసిన అనంతరం తదుపరి బుకింగ్ కోసం రోడ్డు పక్కన తన కారును నిలిపి వేచి చూస్తున్న సమయంలో ఈ ఘటన...