మొటిమ‌లు అధికంగా ఏర్ప‌డుతున్నాయా.. అందుకు కార‌ణాలు ఇవే.. ఏం చేయాలంటే..

వేసవికాలంలో చెమట, తేమ, కాలుష్యం, సన్‌స్క్రీన్ వాడకం వంటి కారణాల వల్ల చర్మం జిడ్డుగా మారడం సహజమే. ఈ సమయంలో చాలామందికి మొటిమలు, చర్మంపై చిన్న చిన్న దద్దుర్లు కనిపించడం మొదలవుతుంది. దీంతో ముఖాన్ని తరచూ కడుక్కోవడం ద్వారా చర్మం శుభ్రంగా ఉంటుందని భావిస్తారు. అయితే ముఖాన్ని అతిగా శుభ్రం చేయడం కూడా మొటిమలకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖాన్ని శుభ్రం చేయడం చర్మ సంరక్షణలో ముఖ్యమైన భాగమే అయినప్పటికీ, దాన్ని తప్పు పద్ధతిలో చేయడం వల్ల చర్మం సహజ రక్షణ పొర దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో చర్మంలో బ్యాక్టీరియా పెరగడం, అధికంగా ఆయిల్ ఉత్పత్తి కావడం వంటి సమస్యలు తలెత్తి మొటిమలు మరింత...