రోజూ ఉదయం ఈ యోగాసనాలను వేస్తే.. రోజంతా మనశ్శాంతిగా ఉండవచ్చు..
ఉదయం లేవగానే చాలా మంది చేసే పనులు ఆ రోజు మొత్తం మానసిక స్థితి, శక్తి స్థాయిలు, ఉత్పాదకతపై ప్రభావం చూపుతాయి. అయితే చాలా మంది ఉదయం నిద్రలేచిన వెంటనే మొబైల్ ఫోన్‌లో సందేశాలు, సోషల్ మీడియా లేదా ఈ-మెయిల్స్ చూడటంతో రోజును ప్రారంభిస్తారు. దీంతో రోజు మొదలయ్యే సమయానికే ఒత్తిడి, ఆందోళన పెరిగి మిగతా సమయం కూడా హడావుడిగా గడిచే అవకాశం ఉంటుంది. ఉదయం నిదానంగా, ప్రశాంతంగా ప్రారంభమైతే శరీరం, మనసు రెండూ సమతుల్యంగా పనిచేస్తాయి. ఇందుకోసం యోగా, శ్వాసాభ్యాసాలు, తేలికపాటి వ్యాయామాలను దినచర్యలో భాగం చేసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ఉదయాన్నే కొద్దిసేపు సూర్యరశ్మిలో గడపడం, తగినంత నీరు తాగడం, శరీరాన్ని కదిలించే వ్యాయామాలు...