నెట్ బౌలర్ నుంచి టెస్ట్ హీరోగా.. మానవ్ సుతార్ అద్భుత ప్రయాణం
ముల్లాన్‌పూర్ టెస్టుకు ముందు భారత తుది జట్టు ఎంపికపై విమర్శలు వచ్చాయి. ఇది టీమిండియానా లేక ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ జట్టా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేశారు. కెప్టెన్ గిల్‌తో పాటు సుదర్శన్, సుందర్, ప్రసిధ్, సిరాజ్, మానవ్ సుతార్ రూపంలో ఏకంగా ఆరుగురు జీటీ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు దక్కడంతో తీవ్రమైన ట్రోల్స్ నడిచాయి. కానీ, మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో విమర్శలు వచ్చిన ఈ ఆటగాళ్లే అద్భుతంగా రాణించి భారత్‌కు ఘన విజయాన్ని అందించారు. అందునా అరంగేట్రం ఆటగాడు మానవ్ సుతార్ తన ఎంపికకు 100 శాతం న్యాయం చేస్తూ, పదునైన బౌలింగ్‌తో విమర్శకుల నోళ్లు...