హోర్ముజ్ జ‌ల‌సంధి వ‌ద్ద కూలిన అపాచీ హెలికాప్ట‌ర్

న్యూయార్క్‌: అమెరికా సైన్యానికి చెందిన అపాచీ అటాక్ హెలికాప్ట‌ర్(Apache helicopter) .. హోర్ముజ్ జ‌ల‌సంధి వ‌ద్ద కూలింది. ఆ హెలికాప్ట‌ర్‌లో ఉన్న ఇద్ద‌రు సిబ్బంది క్షేమంగా ఉన్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. మ‌రో వైపు ఇరాన్‌తో వార్‌లో వ్యూహాత్మ‌కంగా మారిన హోర్ముజ్ జ‌ల‌సంధి వ‌ద్ద మ‌ళ్లీ ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెలకొన్న‌ది. మంగ‌ళ‌వారం ఆ హెలికాప్ట‌ర్ కూలింది. కానీ దేని వ‌ల్ల ఆ ఘ‌ట‌న జ‌రిగిందో ఇంకా తెలియ‌దు. రెండు రోజుల క్రితం ఇరాన్‌, ఇజ్రాయెల్ మ‌ధ్య మ‌రోసారి దాడులు జ‌రిగిన విష‌యం తెలిసిందే. సోమ‌వారం రాత్రి ఎన్‌బీఏ ఫైన‌ల్స్ మ్యాచ్ వీక్షించిన ట్రంప్‌.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టు వ‌ద్ద జ‌ర్న‌లిస్టుల‌తో మాట్లాడుతూ పైల‌ట్లు క్షేమంగా...