క్యూబాలో 150 ఏండ్లలోనే అత్యంత భారీ భూకంపం.. ఇరాన్‌లోనూ!

ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం వణికించిన 24 గంటల్లోనే క్యూబా, ఇరాన్‌లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దక్షిణ ఇరాన్‌లోని హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదే క్యూబాలో రిక్టర్‌స్కేలుపై 6.1 తీవ్రత నమోదైంది. గత 150 ఏండ్లలో ఆ ప్రాంతంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపంగా దీన్ని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు