కీపర్ షూ అడ్డురావడంతో ప్రియాన్షు ఆర్యా రనౌట్.. తప్పించుకున్న రుతురాజ్ గైక్వాడ్ ..
శ్రీలంక-ఏ టీమ్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత-ఏ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 రన్స్ చేసింది. యువ సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అతను కేవలం 12 రన్స్ మాత్రమే చేశాడు. ఇక ప్రభుసిమ్రన్ కూడా స్వల్ప స్కోరుకే నిష్క్రమించాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్, ప్రియాన్షు ఆర్యా భారత బ్యాటింగ్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో.. ప్రియాన్షు ఆర్యా అనూహ్య రీతిలో రనౌటయ్యాడు.