ఘనంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదినాని బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ లోని ప్రభుత్వ దవాఖాన లో బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘాల నాయకులు జాజుల జన్మదినాన్ని పురస్కరించుకొని సంక్షేమ సంఘం జిల్లా బాధ్యులు నాగుల కనకయ్య గౌడ్ కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు పేషెంట్ల అనుచరులకు అన్నప్రసాద వితరణ చేశారు , ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీనివాస్ గౌడ్ తన పోరాటాలతో బీసీ విద్యార్థులకు బోధనా రుసుముతో పాటు సంక్షేమ వసతి గృహాల ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు. అలాగే జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్ట...