కాలుష్య కాసారంగా రాయగిరి చెరువు - దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న యాదాద్రి భక్తులు
పరిశ్రమల వ్యర్థ జలాలు శుద్ధి చేశాకే బయటకు వదలాలి. ఇలా చేయటం వల్ల పర్యావరణం కాలుష్యం కాదు. ఇది తప్పకుండా చేయాల్సిన పని. ఎందుకంటే ఆ కలుషిత నీళ్లు జనాలు తాగే నీటిలో కలిసే అవకాశం ఉంటుంది. దీనివల్ల వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. అయితే యాదాద్రి జిల్లా భువనగిరిలోని ఓ పరిశ్రమలో మాత్రం అలాంటిదేం కనిపించడం లేదు. నిబంధనలకు నీళ్లొదులుతూ పరిశ్రమ నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా వ్యర్థ జలాలను చెరువులోకి వదులుతున్నారు. ఫలితంగా భరించలేని దుర్వాసన వెదజల్లుతోంది. పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టకు వచ్చే భక్తులకు సైతం ఇది ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. విస్తరణ పనుల్లో భాగంగా వెలుగులోకి : యాదాద్రి రైల్వే స్టేషన్‌కు సమీపంలో రాయగిరి...