కౌమార యువతలో జీవన నైపుణ్యాలను పెంపొందించాలి - లయన్ జిల్లా గవర్నర్ కోదండరామ్ సింహరాజు
యువభారతంలోని అతి ముఖ్యమైన విభాగం అయిన కౌమార యువతలో సరైన ఆధునిక జీవన నైపుణ్యాలు పెంపొందిస్తేనే రేపటి భారతదేశానికి సమర్థవంతమైన నాయకత్వం లభిస్తుందని లయన్ జిల్లా గవర్నర్ లయన్ సింహరాజు కోదండరామ్ అన్నారు. ఈ రోజు స్థానిక సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో శాతవాహన లయన్స్ క్లబ్ నిర్వహించిన ప్రతిష్ఠాత్మక రెండు రోజుల లయన్స్ క్వెస్ట్ టీచర్ ట్రైనింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ టీన్ ఏజ్ యువత శరీరంలో వచ్చే హార్మోనల్ మార్పులకు అనుగుణంగా వారి మానసిక స్థాయిని సరైన పద్ధతిలో మార్గదర్శనం చేయడానికి లయన్స్ క్వెస్ట్ శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. కౌమార యువత వ్యక్తిగత శారీరక, మానసిక, భావోద్వేగ...