ఉదయం బ్రేక్ఫాస్ట్, పాలు - 6 నుంచి 10 తరగతులకు కొత్తగా అభ్యాస పుస్తకాలు :
నూతన విద్యా సంవత్సరం (2026-27)లో ప్రభుత్వ పాఠశాలల బాగుకు వాటిల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న దృఢ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. పేద పిల్లల సంక్షేమానికి ఈసారి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వనుంది. విద్యార్థుల సంఖ్యను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ విద్యాశాఖ, మే నెలలోనే బడిబాట కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ప్రతి పాఠశాలలో గతేడాది కంటే ఈసారి 10 శాతం విద్యార్థుల నమోదును పెంచాలని సంబంధిత టీచర్లకు లక్ష్యాన్ని నిర్దేశించింది. జూన్ 15న పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరానికి ప్రభుత్వ సమాయత్తం, విద్యార్థుల కోసం తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. అటు వసతులు, ఇటు...