బంకుల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు- సంక్షోభం వేళ కేంద్రం కీలక నిర్ణయం

పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం వల్ల ఇంధన సరఫరా కష్టమవుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు పెట్రోల్ పంపుల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకుండా నిషేధం విధించింది. బదులుగా వారి అవసరాల కోసం ఇంధనాన్ని బల్క్ అమ్మకపు కేంద్రాల నుంచి పొందాలని సూచించింది. ఈ ఆంక్షలు 90 రోజుల వరకు అమల్లోకి ఉంటుందని పేర్కొంది. ఒక వాహనానికి రోజుకు 200 లీటర్ల కంటే ఎక్కువ ఇంధనం నింపవద్దని రిటైల్‌ అవుట్‌లెట్ల యాజమాన్యానికి ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. డీజిల్‌కు పెరిగిన డిమాండ్ ధరల వ్యత్యాసం కారణంగా బల్క్...