సమ సమాజ స్థాపన కోసం సిపిఎం పోరాటం
- సిపిఎం జిల్లా కార్యదర్శి జి వెంకట్రామిరెడ్డి నారాయణపేట జిల్లా , జూన్ 12 (బి. వి. కే న్యూస్) సమాజంలో ధనిక పేదల మధ్య అంతరాన్ని తగ్గించి సమానత్వాన్ని సాధించేందుకు సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జి వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం రోజు మక్తల్ మండల పరిధిలోని సత్యారం గ్రామంలో సిపిఎం పార్టీ జండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే పార్టీ సిపిఎం పార్టీ అని అన్నారు . అన్యాయానికి వ్యతిరేకంగా పీడనకు, ధోపిడికి వ్యతిరేకంగా పేద ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహిస్తుందని...