డ్రగ్స్ నిర్మూలన గురించి విస్తృత తనిఖీలు
: మాగనూరు ఎస్సై అశోక్ బాబు నారాయణపేట జిల్లా,జూన్ 12( బి వి కే న్యూస్ ) జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ఆదేశాల మేరకు మాగనూరు నారాయణపేట జిల్లా, మాగనూరు మండల కేంద్రంలో మత్తు పదార్థాల నిర్మూలన కోసం ఈగల్ ఫోర్స్ టీంతో కలిసి, నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలం విక్కి తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు మాగనూర్ ఎస్ఐ అశోక్ బాబు తెలిపారు. బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు, పాన్ షాపులు, కిరణ దుకాణాలు అనుమానాస్పద ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టామని తెలిపారు. మత్తు పదార్థాల రవాణా, నిల్వ, విక్రయాలు మరియు వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు జిల్లా పోలీసులు పకడ్బందీ చర్యలు...