సంగారెడ్డిలో భారీ సైబర్ మోసం..
పటాన్‌చెరు శ్రీనగర్ కాలనీకి చెందిన విశ్రాంత ప్రైవేటు ఉద్యోగి మోహన్ రెడ్డి.. సైబర్ నేరగాళ్ల చేతిలో భారీ మోసానికి గురయ్యారు. మనీలాండరింగ్ కేసు పేరుతో భయపెట్టి ఆయన నుంచి మొత్తం రూ.58.94 లక్షలను దశలవారీగా వసూలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడికి.. ప్రవీణ్ కుమార్, రాజేశ్ మిశ్రా అనే ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేశారు. జెట్ ఎయిర్‌వేస్ మాజీ చైర్మన్ నరేశ్ గోయల్‌కు సంబంధించిన రూ.538 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆధార్ వివరాలు దుర్వినియోగమయ్యాయని ఆరోపిస్తూ మోహన్ రెడ్డిని బెదిరించారు. ఈ కేసులో మీ పేరుతో కూడా లావాదేవీలు జరిగాయని, దాదాపు...