ఎంఎస్ఎంఈ పార్కులతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు

ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ మంత్రి టీజీ భరత్ గుప్తా (AP Minister TG Bharat) వ్యాఖ్యానించారు. ఈ పార్కుల ద్వారా వేలాదిమందికి ఉద్యోగాలు దక్కుతాయని పేర్కొన్నారు. ఈరోజు(శనివారం) మంత్రి భరత్ కర్నూల్‌లో పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 19 కంపెనీల్లో 1460 ఉద్యోగాలకు జాబ్‌మేళా నిర్వహించామని తెలిపారు. ఒక్కరికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్‌మేళా నిర్వహిస్తామని వివరించారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు సృష్టించేందుకు...