సూపర్ సండే- వరల్డ్​కప్​లో బిగ్ ఫైట్- ఇవాళే భారత్ vs పాక్ మ్యాచ్- ఎక్కడ చూడాలో తెలుసా?

2026 మహిళల టీ20 వరల్డ్​కప్​లో హై వోల్టేజ్ మ్యాచ్​కు సమయం ఆసన్నమైంది. ఇంకొన్ని గంటల్లోనే ఈ పొట్టికప్పు టోర్నీలో భారత్- పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్​తోనే హర్మన్​సేన ఈ టోర్నీని ఆరంభించనుంది. అందుకే విజయంతో వరల్డ్​కప్​ను ప్రారంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరు జట్ల బలాబలాలు ఏంటి? హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి? లైవ్ మ్యాచ్ ఎక్కడ చూడవచ్చు అనే విషయాలు చూద్దాం! భారత్ బలంగా! గతేడాది వన్డే వరల్డ్​కప్ నెగ్గిన జోష్​లో టీమ్ఇండియా ఈ టోర్నీ బరిలో దిగుతోంది. అయితే ఇటీవల ఇంగ్లాండ్​తో సిరీస్​ కోల్పోవడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొడుతోంది. కానీ, పాకిస్థాన్​పై విజయం సాధిస్తే అమ్మాయిల కాన్ఫిడెంట్...