పిల్లల్లో "మలబద్ధకానికి కారణాలు" ఏంటి? - ఏం చేస్తే ఈ సమస్య తగ్గుతుంది!

ఈ తరం పిల్లల్లో శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. ఎంత సేపూ కదలకుండా ఒకే చోట కూర్చోవడం, గంటల తరబడి గ్యాడ్జెట్లకు అతుక్కుపోవడం వల్ల ఒబెసిటీ వంటి సమస్యలే కాదు.. మలబద్ధకం కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది చిన్నారుల్లో మలబద్ధకం రావడానికి కారణాలు, వాటి పరిష్కార మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం! కారణాలివేనా?: పిల్లల్లో మలబద్ధకం సమస్య రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ప్రస్తుతం గ్యాడ్జెట్ల వినియోగం పెరిగిపోవడంతో గంటల తరబడి వాటికే అతుక్కొని పోతున్నారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గిపోవడం, ఆటాలాడకుండా ఎక్కువ సేపు కదలకుండా ఒకే చోట కూర్చోవడం వల్ల ఊబకాయం, మలబద్ధకం లాంటి...