సంతాన భాగ్యానికి ఎన్నెన్ని చిక్కులో! - మంచి జీవనశైలితో సాధ్యమట!
ఎంత చదువుకున్న, ఏ స్థాయికి ఎదిగిన, ఎన్ని సాధించిన 'అమ్మా, నాన్న' పిలుపును కోరుకోని వారు ఉండరు. కానీ, మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, అధిక రేడియేషన్, ఆలస్యంగా వివాహం చేసుకోవడం వంటి కారణాల చేత చాలా మంది ఈ పిలుపుకు దూరమవుతున్నారు. ఈ క్రమంలోనే గర్భధారణ కోసం ఎంత ప్రయత్నిస్తున్నా.. చాలా మందిలో ఫలితం కనిపించడం లేదట. ఇలాంటి సమయంలో జీవనశైలి ఎలా ఉందో చూసుకోవటం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే సంతానం కలగకపోవటం అనేది ఏదో ఒక్క సమస్యతో ముడిపడి ఉండదని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మంచి జీవనశైలితో సంతాన భాగ్యం ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం! సంతానలేమి పై తీవ్రమైన మానసిక...