జ్వరం నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు ఉపశమనం కలిగించే 'జ్వరహరేశ్వరుడు'- విచిత్ర శివ స్వరూపం గురించి తెలుసా?

హిందూ మత విశ్వాసాల ప్రకారం భరించలేని రోగాలు, చికిత్సకు లొంగని మొండి రోగాలు శివుణ్ణి ఆశ్రయిస్తే తొలగుతాయని విశ్వాసం. పరమేశ్వరుడు లయకారుడు మాత్రమే కాదు రోగహారకుడుగా కూడా పలుచోట్ల పూజలందుకుంటున్నాడు. దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ప్రాణాంతక వ్యాధులు కూడా పరమేశ్వరుని అనుగ్రహం తో నయమైన ఘటనలు ఆధ్యాత్మిక చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటిదే ఓ శివ స్వరూపం విష జ్వరాలను సైతం నయం చేస్తుందని విశ్వాసం. జ్వర హరేశ్వరునిగా శివుడు పూజలందుకుంటున్న ఈ క్షేత్రం ఎక్కడుంది? ఆ విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. జ్వరహరేశ్వరుని స్వరూపం! మూడు ముఖాలు, మూడు కాళ్లు! మూడు చేతులు, అగ్నిజ్వాలలు వంటి నేత్రాలు వ్యాధులను నయం చేసే ఈశ్వరుని విచిత్ర...