స్పీడ్ సైకిల్ పోటీలలో ప్రతిభను కనబరిచిన వారికి మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేత
- పార్టిసిపేషన్ వారందరికీను సర్టిఫికెట్స్ అందజేత - జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి. గోపాలం నారాయణపేట జిల్లా, జూన్ 15 (బి వి కే న్యూస్) అస్మిత ఖెలో ఇండియా సౌత్ జోన్ కోఆర్డినేటర్ పాషాబై, తెలంగాణ సైకిలింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పి. మల్లారెడ్డి, బి. విజయ కాంతారావు ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి. గోపాలం ఆధ్వర్యంలో ఈ నెల 13న, నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణం కొత్త గార్లపల్లి రోడ్డులో ఖేలో ఇండియా సైక్లింగ్ ఉమెన్స్ సిటీ లీగ్ (ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా) బాలికలసబ్ జూనియర్, జూనియర్, మహిళల సీనియర్ రోడ్డు స్పీడ్...