ఈ సీజన్‌లోనూ వ్యాప్తి చెందుతున్న డెంగ్యూ..
వర్షాకాలంలోనే ఎక్కువగా కనిపించే డెంగ్యూ ఇప్పుడు వేసవికాలంలోనూ నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా డెంగ్యూ అంటే వర్షాలు, నిల్వ నీరు గుర్తుకు వస్తాయి. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, తీవ్ర ఉష్ణోగ్రతలు, ఆకస్మిక వర్షాలు, పెరుగుతున్న తేమ కారణంగా డెంగ్యూ వ్యాప్తి కాలం విస్తరిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో వేసవిలో వచ్చే జ్వరం, శరీర నొప్పులను నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఎండలు తీవ్రరూపం దాల్చిన తర్వాత అకస్మాత్తుగా వర్షాలు కురవడం, ఆ తర్వాత తేమ పెరగడం వంటి పరిస్థితులు దోమల పెరుగుదలకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చిన్నచిన్న...