డాక్టర్ ప్రిస్క్పిప్షన్ ఉంటేనే దగ్గు సిరప్‌లు..
దగ్గు సిరప్‌ల(Cough Syrups) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దగ్గు సిరప్‌లను కొనేందుకు డాక్టర్ ప్రిస్క్పిప్షన్ తప్పనిసరి అని కేంద్రం పేర్కొన్నది. ఈ నేపథ్యంలో నోటీఫికేషన్ జారీ చేసింది. 1945 నాటి డ్రగ్ రూల్స్ లోనూ సవరణలు చేశారు. తమిళనాడుకు చెందిన శ్రీసన్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తాగి సుమారు 20 మంది చిన్నారులు మృతిచెందారు. అయితే ఆ ఘటన పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ తయారీకి చెందిన దగ్గు మందుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో తన హెచ్చరికల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. 2026 డ్రగ్స్ రూల్స్‌ను కేంద్రం నోటిఫై చేసింది....