సమంతకు ‘ఐ లవ్ యూ’ చెప్పమన్న యాంకరమ్మ..
సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకురాలు నందినీ రెడ్డి, నటి-నిర్మాత సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు మరియు చిత్రబృందం హాజరై సందడి చేశారు. ఈవెంట్ మొత్తం సమంత అభిమానుల సందడితో మార్మోగిపోయింది. ముఖ్యంగా రాజ్ నిడిమోరు స్టేజ్‌పై మాట్లాడుతున్న సమయంలో అభిమానులు గట్టిగా నినాదాలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఫ్యాన్స్ ఏమంటున్నారో తనకు సరిగా వినిపించడం లేదని రాజ్ చెప్పగా, యాంకర్ సుమ వెంటనే స్పందించారు. “అభిమానులు సమంతకు ఒకసారి ‘ఐ లవ్ యూ’...