బెంగాల్ బ్లాక్‌బస్టర్ షో.. అన్‌సంగ్ హీరో మిథున్ చక్రవర్తి
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయానికి చాలా కాలం ముందు నుంచే జనంతో ఆయన మమేకమయ్యారు. పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. బెంగాల్‌లో మార్పునకు 2026 ఎన్నికల్లో పిలుపునిచ్చారు. పశ్చిమబెంగాల్‌లో బీజేపీకి అఖండ విజయం సాధించిన పెట్టిన 'అన్‌సంగ్ హీరో'లలో ఒకరుగా నిలిచారు. ఆయనే మిథున్ దా అలియాస్ మిథున్ చక్రవర్తి. 2026లో కిరీటం మనదే (బీజేపీ). ఆ లక్ష్య సాధనకు ఏమి చేయలో అది చేరి తీరుతాం' అని మిథున్ చక్రవర్తి 2024లోనే ప్రకటించారు. ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ హహా కొనసాగి, బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే మిథున్ మాత్రం 2026లో అధికారం మనదేనంటూ జోస్యం...