తల్లీకూతుళ్లపైకి దూసుకెళ్లిన కారు..

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. పార్కింగ్ ఏరియాలో ఓ కారు తల్లీకూతుళ్లపైకి దూసుకెళ్లింది. దీంతో తల్లీకూతుళ్లు గాయపడ్డారు. ఆదివారం చోటుచేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ క్రితికా శర్మ సెక్టార్ 79లోని మహాగుణ్ మీరాబెల్లీ సొసైటీలో కుటుంబసభ్యులతో కలిసి ఉంటోంది. ఆదివారం క్రితికా తన కుటుంబసభ్యులతో కలిసి బేస్‌మెంట్‌లోని పార్కింగ్‌లోకి వెళ్లింది. వారు తమ వాహనంలోని సామాన్లను బయటకు తీస్తున్నారు. ఈ సమయంలో ఓ కారు వేగంగా వారి వైపు దూసుకువచ్చింది. క్రితికా, ఆమె ఐదేళ్ల కూతురు ఆర్యల మీదుగా ముందుకు దూసుకుపోయింది. ఆర్య స్వల్పగాయాలతో బయటపడగా.. క్రితికాకు తీవ్రగాయాలు...