రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

కరీంనగర్ రూరల్ మండలంలోని చేగుర్తి గ్రామంలో ఈరోజు లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత Rahul Gandhi జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బాసవేణి సరోజన మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ దేశ ప్రజల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, యువతకు ఉపాధి అవకాశాలు, రైతుల సంక్షేమం, మహిళల సాధికారత కోసం రాహుల్ గాంధీ నిరంతరం పోరాటం చేస్తున్న నాయకుడని కొనియాడారు. దేశంలో ప్రజాస్వామ్య విలువల...