రోజూ కాకుండా అప్పుడ‌ప్పుడు పొగ తాగినా న‌ష్ట‌మే.. ఏమీ కాద‌ని అనుకోవ‌ద్దు..

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలిసిన విషయమే. అయితే చాలామంది రోజూ సిగరెట్లు తాగే వారికే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అప్పుడప్పుడు మాత్రమే సిగరెట్ తాగితే పెద్దగా హాని ఉండదని భావిస్తుంటారు. కానీ అరుదుగా లేదా సామాజిక సందర్భాల్లో మాత్రమే ధూమపానం చేసినా శరీరంపై ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల వెలువడిన‌ పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పొగాకు పొగలో 7 వేలకుపైగా రసాయనాలు ఉంటాయి. వీటిలో అనేక క్యాన్సర్ కారకాలు, విషపూరిత పదార్థాలు కూడా ఉంటాయి. రోజూ ధూమపానం చేసే వారితో పోలిస్తే అప్పుడప్పుడు సిగరెట్ తాగే వారి పొగాకు మోతాదు తక్కువగా ఉంటుంది. అయితే...