నిరంజన్ ఇంటికి బండ్ల గణేష్..

ప్రముఖ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండ బాలుడు నిరంజన్ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు (శనివారం) హనుమకొండ, హనుమాన్ నగర్‌‌లోని బాలుడి ఇంటికి బండ్ల గణేష్ వెళ్లారు. నిరంజన్‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిరంజన్ తల్లిదండ్రులు రాంగోపాల్ చారి, మానసలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ తరఫున ఐదు లక్షల రూపాయల చెక్‌ను నిరంజన్ తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ భక్తుడిగా.. ఆయన స్ఫూర్తితో నిరంజన్‌కు ఆర్థిక సాయం చేశాను. దైవసమానులైన పవన్ కల్యాణ్ పరామర్శతో...