ఆరోగ్య యోగం కోసం యోగాభ్యాసం

(21 జూన్‌ “అంతర్జాతీయ యోగా దినోత్సవం” సందర్భంగా) అష్టఐశ్వర్యాలు, విలాసవంతమైన సౌకర్యాలు ఎన్ని ఉన్నా ఆరోగ్యం జతకూడని జీవితాలు దుర్భరమే కదా. అనారోగ్యం చుట్టుముట్టినపుడు ఆరోగ్యం ప్రాధాన్యత అవగతం అవుతుంది. లక్షల ఖరీదైన మంచం, పరుపులు ఉన్నప్పటికీ పడుకోగానే నిద్రరాని వారు అభాగ్య నిరుపేదలే అవుతారు. ఔషధాలు కొనవచ్చు కాని, ఆరోగ్యాన్ని కొనలేము అన్నటికీ. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్య సంరక్షణకు గొడుగులు పట్టాలి. నిత్యం ఓ గంట లేదా అరగంట ఆరోగ్య భాగ్యానికి కేటాయించాలి. జ్వరం లేకపోవడం ఆరోగ్యంగా ఉన్నట్లు కాదని తెలుసుకోవాలి. ‘యోగా’ అనే పదానికి అర్థం ‘ఐక్యత’ లేదా ‘కలయిక’ అని తెలుసుకోవాలి. ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, భావోద్వేగభరితంగా, సామాజికంగా,...