సుస్వర సంగీతాన్ని ఆస్వాదించని వారుండరు కదా !
(21 జూన్ “ప్రపంచ సంగీత దినోత్సవం” సందర్భంగా) “శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తల గానస్రవంతో ఫణిః” అని ఆర్యోక్తి. అనగా శిశువులు, పశువులు, పావులు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయి. మానసిక స్థితిని నియంత్రించడానికి సంగీతం ఒక గొప్ప మార్గం. ఆది ప్రణవనాదమైన “ఓంకారం” నుంచి సంగీతం ఉద్భవించింది. సంగీత సాధన ద్వారా ఏకాగ్రత, మేధో వికాసం పెరుగుతాయి. సంగీతం ఓ విశ్వ భాష. సంగీతానికి పేద ధనిక, కుల మతాల, ప్రాంత, సరిహద్దులు, సాంస్కృతులు, వర్ణ-వర్గ వివక్షలు, భాషా బేధాలు ఉండవు. సుస్వర సంగీతం అందరినీ అలరిస్తుంది. సంగీత సాధన ఓ దివ్య తపస్సు. సంగీత సాగరంలో ఈదిన వారికి శారీరక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక, సామాజిక...