రేవులో మృత్యువుతో దోబూచులాట!
గలగల పారే గోదారమ్మపై ఎప్పుడు మృత్యువు విలయతాండవం చేస్తుందో ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే గతంలో గోదావరి నదిపై జరిగిన ఘోర పడవ ప్రమాదాలు అలాంటివి. వందలాది కుటుంబాల్లో నింపిన శోకం ఇంకా కళ్లముందే కదలాడుతున్నాయి. అయినా సరే, కొందరు నిర్వాహకులకు భయం లేదు.. అధికారులకు అస్సలు పట్టడం లేదు! డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం సోంపల్లి వద్ద వశిష్ట గోదావరి నదిపై సాగుతున్న పడవ ప్రయాణాలు ఇప్పుడు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైఫ్ జాకెట్లు లేవు.. రాత్రి వేళల్లోనూ యథేచ్ఛగా.....