మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సన్మానిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాకిటి శ్రీహరి

నారాయణపేట జిల్లా, జూన్ 20( బి వి కే న్యూస్ ) తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్బంగా శనివారం క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ్ కి బొకే ఇచ్చి షాలువాతో సత్కరించి ఆయనకు శుభాభినందనలు తెలియజేశారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజాసేవకై ఆ భగవంతుడు ఉత్తమ్ గారికి మరింత బలాన్ని ప్రసాదించాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.