ఈనాడు లక్ష్య అథ్లెటిక్స్ కోచ్ జగదీష్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
నారాయణపేట జిల్లా, జూన్ 21 (బి వి కే న్యూస్) ఈనాడు లక్ష్య అథ్లెటిక్స్ కోచ్ జగదీష్ నిర్వహణలో యోగా గురువు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో చత్రపతి శివాజీ వాకర్స్ అసోసియేషన్ సభ్యుల సమక్షంలో ఉ:ము 6:00 గం:కు నిర్వహించిన యోగ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులను మరియు విద్యార్థులను ఉద్దేశించి యోగ గురువు నారాయణ రెడ్డి మాట్లాడుతూ అనాది కాలము నుండి భారత దేశంలో యోగ అనేది శారీరక నిర్మాణానికి ఆధ్యాత్మిక చింతనానికి ఉపయోగపడేదని క్రమక్రమంగా అది మరుగుపడుతున్న దశలో మన ప్రధానమంత్రి...