సైలెంట్‌గా పెళ్లి పీట‌లెక్కిన ష‌ణ్ముఖ్ జ‌స్వంత్

బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ తన అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. గత కొంతకాలంగా తన ప్రేమ జీవితం గురించి పలు ఊహాగానాలు వినిపిస్తుండగా, ఇటీవ‌ల‌ తన ప్రేయసి వైష్ణవి చోడిశెట్టితో నిశ్చితార్థం చేసుకుని ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.ఇక తాజాగా కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల మ‌ధ్య పెళ్లి పీట‌లెక్కాడు.ఎలాంటి హ‌డావిడి లేకుండా రాజ‌మండ్రికి చెందిన వైష్ణ‌వితో ఏడుడ‌గులు వేయ‌గా, వారి పెళ్లికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ప‌లువురు ఈ జంట‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. పెళ్లి ఫొటోల్లో...