అంత్యక్రియలకు మా డబ్బులే వాడండి..
చిత్తూరు జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. భార్య అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. భార్య, ఇద్దరు పిల్లలకు విషం తాగించి, ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అంత్యక్రియలకు తమ డబ్బులనే వాడాలంటూ ఒక సూసైడ్ నోట్ కూడా రాసిపెట్టాడు. నోట్‌లో బ్యాంకు ఏటీఎం కార్డు పిన్ నంబర్, ఫోన్ పే నంబర్‌ను రాసి ఉంచడం ఇప్పుడు కలచివేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా దిగుమసపల్లె పంచాయతీలోని బంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దామోదరం (30), నిర్మల (25) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు రాజేశ్, శ్రీవిద్య. జీవితం సాఫీగా సాగిపోతుందనుకున్న సమయంలో నిర్మలకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. పరిస్థితి విషమించడంతో సీఎంసీ...