‘నా బిడ్డే నా ప్రపంచం’ ..అమ్మ‌తనం గురించి సమంత ఎమోషనల్ కామెంట్స్

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ హ్యాపీ మూడ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మరోవైపు, సమంత తల్లి కాబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో మాతృత్వంపై సమంత చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్‌గా మారాయి. కొన్నేళ్ల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత మాతృత్వం గురించి ఎంతో భావోద్వేగంగా మాట్లాడింది. తల్లిగా మారడం తన జీవితంలో అత్యంత అందమైన, ప్రత్యేకమైన అనుభవంగా భావిస్తానని ఆమె తెలిపింది. నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది. పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతలు,...