యోగా డే వేడుకల్లో శ్రీలీలకు అవమానం..

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముంబైలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్, బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని యోగాసనాలు చేశారు. అయితే కార్యక్రమం ముగిసిన అనంతరం జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు నెట్టింట పెద్ద వివాదంగా మారింది. యోగా కార్యక్రమం అనంతరం అమృత ఫడ్నవీస్, ఆమె కుమార్తె, శ్రీలీల కలిసి మీడియా ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇచ్చారు. ఈ సందర్భంగా కొందరు ఫోటోగ్రాఫర్లు కేవలం అమృత ఫడ్నవీస్, ఆమె కుమార్తెతో మాత్రమే ఫోటోలు...