సామాన్య ప్రజలపై సన్నబియ్యం పిడుగు - 20 శాతం పెరిగిన ధరలు!

గ్యాస్, ఇంధన, నిత్యావసర సరకుల ధరల పెరుగుదలతో లబోదిబోమంటున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఇప్పుడు మరో పిడుగు పడింది. అదే సన్నబియ్యం. గడిచిన ఇరవై రోజుల్లో వీటి ధర ఏకంగా 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగినట్లు మిల్లర్లు, బియ్యం వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా జేఎస్‌ఆర్, ఆర్‌ఎన్‌ఆర్, హెచ్‌ఎంటీ, బీపీటీ వంటి సన్నాల రకాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పలు రాష్ట్రాల్లో వరి ఉత్పత్తి తగ్గడం, తెలంగాణలో ప్రభుత్వం సన్నాలకు బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేయడం వంటి కారణాలతో మార్కెట్లోకి వచ్చే ధాన్యం తగ్గిపోయింది. ఇవే ధరలు పెరగడానికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో కొందరు మిల్లర్లు...