'నారా' వారి కుటుంబంలో వారసుడు - తండ్రైన హీరో రోహిత్
టాలీవుడ్ విలక్షణ నటుడు నారా రోహిత్ తండ్రి అయ్యారు. ఆయన భార్య శిరీష హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో నారా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం తల్లీ బిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. నారా రోహిత్ దంపతులకు మగబిడ్డ విషయం తెలిసిన తర్వాత అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. నారా రోహిత్, శిరీష కలిసి 'ప్రతినిధి 2' చిత్రంలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అక్టోబర్ 30, 2025న హైదరాబాద్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. రోహిత్ పెదనాన్న...