అనిల్ రావిపూడి సినిమా పేరుతో మోసం- క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్

సక్సెస్​ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి- విక్టరీ వెంకటేశ్- నందమూరి కల్యాణ్​ రామ్​ కాంబోలో మల్టీస్టారర్ ప్రాజెక్ట్​ తెరకెక్కుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వార్త ఆ చిత్రబృందానికి తలనొప్పిగా మారింది. అనిల్ రావిపూడి కొత్త చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుల అవసరం ఉందని, ఈ క్రమంలోనే చిన్నారులను క్యాస్టింగ్ చేస్తున్నారని ఆసక్తి గల వారు సంప్రదించాలని సోషల్ మీడియాలో కొందరు ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు. ఆసక్తి ఉన్నవారు సంప్రదించేందుకు ఒక మొబైల్ నంబర్​ను కూడా ఇచ్చారు. అయితే దీనిపై అలర్ట్ అయిన మూవీ టీం సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్రచారంపై స్పందించింది. చైల్డ్ ఆర్టిస్టులను క్యాస్టింగ్ చేస్తున్నామన్న వార్తల్లో...