‘మేమిద్దరం మాట్లాడుకున్నాం’..

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు సూపర్‌స్టార్ రజినీకాంత్ బహిరంగంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదంటూ సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై రజినీకాంత్ స్పందించారు. బుధవారం చెన్నైలో జరిగిన తన కొత్త చిత్రం ‘ధర్మన్’ లాంచ్ కార్యక్రమంలో ఆయన ఈ వివాదానికి తెరదించారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మీడియా అడిగిన ప్రశ్నకు రజినీకాంత్ బదులిస్తూ, తామిద్దరం ఇప్పటికే వ్యక్తిగతంగా (ప్రైవేట్‌గా) మాట్లాడుకున్నామని దీనిపై చ‌ర్చ‌లు అవ‌స‌రం లేదని తెలిపాడు. జూన్ 22న ముఖ్యమంత్రి విజయ్ 52వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, కమల్ హాసన్, కీర్తి సురేష్, ఖుష్బూ సుందర్, మోహన్‌లాల్, త్రిష సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బహిరంగంగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే...