ఉక్రెయిన్‌కు భారత సైన్యాన్ని పంపాలన్న వాన్స్..
ఉక్రెయిన్ (Ukraine) యుద్ధాన్ని ముగించేందుకు గతంలో చర్చలు జరుగుతున్న సమయంలో భారత (India) సైన్యాన్ని శాంతి పరిరక్షక దళంగా పంపాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదన ఓ దశలో అమెరికా (USA) అత్యున్నత స్థాయిలో చర్చకు వచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ఆలోచనను అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెంటనే పక్కన పెట్టినట్లు తాజాగా విడుదలైన ఓ పుస్తకం వెల్లడించింది. అమెరికా జర్నలిస్టులు మ్యాగీ హాబర్‌మన్, జోనాథన్ స్వాన్ రాసిన ‘రెజీమ్ ఛేంజ్: ఇన్‌సైడ్ ది ఇంపీరియల్ ప్రెసిడెన్సీ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్’ పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొన్నిరోజులకే వైట్‌హౌస్‌లో...