లోకల్ ట్రైన్‌లో దారుణ హత్య..

ముంబై లోకల్ ట్రైన్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. డోరు మూసే విషయంలో చోటుచేసుకున్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని అత్యంత పాశవికంగా కత్తితో పొడిచి చంపేశాడు. చుట్టూ జనం ఉండగానే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. హత్య అనంతరం దర్జాగా అక్కడినుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మయాంక్ లోహార్ మంగళవారం రాత్రి చర్చ్‌గేట్ నుంచి నల్లసోపారా వెళ్లే లోకల్ ట్రైన్ ఎక్కాడు. గోరేగావ్ - కందివాలి మధ్యలో తోటి ప్రయాణికుడితో మయాంక్‌కు గొడవైంది. వర్షం పడుతుండటంతో డోరు క్లోజ్ చేసే విషయంలో ఈ గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే...