'నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ' అమలుకు పటిష్ఠ చర్యలు
ఏపీలో 'నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ' సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆర్థిక స్థోమత లేకపోయినా, వ్యాధి అరుదైనదైనా ప్రతి రోగికీ వైద్యం అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. అరుదైన వ్యాధులను ముందే గుర్తించేందుకు రాష్ట్రంలో 'యూనివర్సల్ నియోనాటల్ స్క్రీనింగ్' ప్రారంభించినట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యం, పరిశోధనల కోసం ఏపీలో మూడు 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' కేంద్రాలను గుర్తించామని.. విశాఖ (AMC), విజయవాడ (SMC), తిరుపతిలో 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరిశోధనల కోసం PSU, CSR నిధుల వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని డీఎమ్‌ఈ(DME) అధికారులకు మంత్రి ఆదేశాలు...