ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఎ.ఐ, డిజిటల్ లర్నింగ్ పై అవగాహన
- కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ గౌడ్ నారాయణపేట, జూన్ 24 (బి వి కే న్యూస్) స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మక్తల్ లో విద్యార్థులకు టీచింగ్ ఇంటర్నల్ షిప్ ప్రోగ్రాం ఆన్ ఏఐ డిజిటల్ లెర్నింగ్ పై కళాశాల విద్యా కమిషనర్ ఆదేశానుసారం ఈనెల 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు అవగాహన కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 10:00 నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ ఈ నారాయణ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎఐ డిజిటల్ లెర్నింగ్ పై ఇంతకుముందు ట్రైనింగ్ పొందిన అధ్యాపకులు హరిచంద్ర, దివ్య, బాలరాజ్ లు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు....