మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
: మక్తల్ ఎస్ఐ రాజు నారాయణపేట, జూన్ 25 (బీవీకే న్యూస్) జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మక్తల్ పట్టణంలోని ZPHS బాలుర పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై రాజు మాట్లాడుతూ... యువత దేశ భవిష్యత్తుకు పునాది అని, అలాంటి యువత మత్తు పదార్థాల బారిన పడితే వారి వ్యక్తిగత జీవితం, కుటుంబం మరియు సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, చదువుపై ఏకాగ్రత కోల్పోవడం, నేరాల...