ఈనెల 26న శ్రీ వేణుగోపాల స్వామి మండల పూజ కార్యక్రమం
నారాయణపేట, జూన్ 25( బివికే న్యూస్) మఖ్తల్ పట్టణంలోని యాదవ నగర్ వీధిలో వెలసిన అత్యంత పురాతనమైన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ పున: ప్రతిష్ట జరిగి సంవత్సర కాలం అవుతున్న శుభ సందర్భాన ఈనెల 26 వ తేదీశుక్రవారం ద్వాదశి రోజు స్థానిక శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయంలో విశేష పూజ కార్యక్రమాలు జరగనున్నాయి. కార్యక్రమ వివరాలు.... ఉదయం 8-00 గంటలకు పుణ్యాహవాచనము,గణపతి పూజ 9-00 లకు శ్రీకృష్ణ మంత్ర హోమం 10-00 లకు రుక్మిణి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం జరుగును. ఈ కార్యక్రమంలో సకల భగవద్భద్భక్తులు అందరూ పాల్గొని స్వామి వారి కృప కు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ...