రాష్ట్రం విడిపోయినా మారని బుద్ధి.. తెలంగాణ సినిమాపై ఆకతాయిల వెటకారం..

తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి మరియు వాడుక భాషా నేపథ్యాలతో వచ్చే సినిమాలపై సోషల్ మీడియా వేదికగా తరచూ వివాదాలు రాజుకుంటూనే ఉన్న సంగ‌తి తెలిసిందే. గతంలో భారీ విజయాన్ని అందుకున్న ‘బలగం’ వంటి చిత్రాల విషయంలో జరిగినట్లే, తాజాగా ప్రియదర్శి మరియు నాగదుర్గ ప్రధాన పాత్రల్లో రాబోతున్న ‘ఇడుపు కాయితం’ అనే సినిమాపై కూడా నెట్టింట పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తెలంగాణ వాడుక భాషలో ‘ఇడుపు కాయితం’ అంటే విడాకులు అని అర్థం వస్తుంది. అయితే ఈ చిత్ర టైటిల్ ప్రకటించినప్పటి నుండి సోషల్ మీడియాలో కొందరు ఆంధ్రా ప్రాంతానికి చెందిన నెటిజన్లు దీనిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఇది తెలుగు భాషేనా...