ఫ్రైడే ఓటీటీలో ఎంటర్‌టైన్‌మెంట్ జాతర.
ఈ శుక్రవారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి లేకపోయినా, ఓటీటీ వేదికలపై మాత్రం వినోద ప్రియులకు భారీ ట్రీట్ సిద్ధమైంది. ఒకే రోజు దాదాపు 15కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. మరోవైపు థియేటర్లలో ‘ఒక్కడు’, ‘సినిమా చూపిస్త మావ’ వంటి హిట్ చిత్రాలు రీ-రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరించనున్నాయి. ‘బాహుబలి టార్చ్‌బేరర్’ ప్రత్యేక ఆకర్షణ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ భారతీయ సినీ చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. ఈ సినిమాల వెనుక జరిగిన ప్రయాణం, యుద్ధ సన్నివేశాల రూపకల్పన, మేకింగ్ విశేషాలు, నటీనటుల అనుభవాలను చూపిస్తూ రూపొందించిన డాక్యుమెంటరీ సిరీస్ ‘బాహుబలి:...